Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

బాహుబలి మొసలి

Big-Crocodile

సిడ్నీ: దాదాపు ఎనిమిదేళ్ల నిరంతర వేట అనంతరం ఆస్ట్రేలియా అధికారులు  నరమాంస పిపాసి అయిన భారీ ఉప్పునీటి మొసలిని  పట్టుకున్నారు. దాదాపు 600 కిలోల బరువుండే ఈ మొసలి 4.71 మీటర్ల పొడవుంది. దీని వయసు 60 సంవత్సరాలు ఉంటుందని  వన్యప్రాణి అధికారులు చెప్తున్నారు. క్యాథరిన్‌నది బ్యాక్ వాటర్స్‌లో ఉండే ఈ మొసలి గతంలో చాలాసార్లు స్థానికులు పలువురిపై దాడి చేసింది. ఉప్పునీటి మొసళ్లు సాధారణంగా భారీ సైజులోనూ ఉంటాయి. అయితే క్యాథరిన్ నదిలో ఇప్పటివరకు పట్టుబడిన మొసళ్లలో ఇదే పెద్దది కావడం విశేషం. గత ఏడాది ఓ వృద్ధురాలిపై దాడి చేసిన ఈ మొసలి తీవ్రంగా గాయపర్చింది. దాంతో ఆమె చనిపోయింది. ఈ ఏడాది మార్చిలో కూడా రెండు భారీ మొసళ్లను క్యాథరైన్ బ్రిడ్జి సమీపంలో పట్టుకొన్నట్లు అధికారులు తెలిపారు. అంతరించి పోతున్నాయన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం 1970లో వీటిని రక్షిత జంతువులుగా ప్రకటించింది. అప్పటినుంచి వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది, ప్రతిఏటా సగటున ఇద్దరేసి ఈ మొసళ్ల దాడితో చనిపోతున్నారు. ఇప్పుడు పట్టుకొన్న మొసలిని 2010లో మొదటిసారి చూశారు. అప్పటినుంచి దీనికోసం వేట సాగుతోంది. కాగా సమస్యాత్మకంగా మారిన  మొసళ్లను మొసళ్ల పార్కులో ఉంచుతున్నారు. దీన్ని కూడా అక్కడికే తరలించారు.

Comments

comments