Home సినిమా చిన్న సినిమాకు పెద్ద విజయం

చిన్న సినిమాకు పెద్ద విజయం

Law

గగన్ గోపాల్ ముల్కా దర్శకత్వంలో కమల్ కామరాజు, మౌర్యాణి, పూజా రామచంద్రన్ హీరోహీరోయిన్లుగా రమేష్‌బాబు మున్నా, మద్దిపాటి శివ నిర్మించిన చిత్రం ‘లా’. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన సక్సెస్‌మీట్‌లో కమల్ కామరాజు మాట్లాడుతూ “ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన వస్తోంది. పూజా రామచంద్రన్, మౌర్యాణి అద్భుతంగా నటించారని ప్రశంసలు వస్తున్నాయి. మంచి కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. సినిమా మంచి సక్సెస్‌ను సాధించడం ఆనందంగా ఉంది”అని అన్నారు. దర్శకుడు గగన్ గోపాల్ మాట్లాడుతూ “సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో క్రమక్రమంగా థియేటర్లు పెరుగుతున్నాయి. సినిమా బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూజా రామచంద్రన్, మౌర్యాణి తదితరులు పాల్గొన్నారు.

Big Hit for a Small Movie : LAW Movie Success Meet 

Telangana News