Home సినిమా పూజాకు లక్కీ ఆఫర్

పూజాకు లక్కీ ఆఫర్

 

అల్లుఅర్జున్ చిత్రం ‘డీజే’లో గ్లామరస్‌గా కనిపించి యూత్‌ను అలరించిన ముద్దుగుమ్మ పూజాహెగ్డే. ఈ చిత్రం తర్వాత లక్కీబ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ భామ. ఆతర్వాత ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చిత్రంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘కవచం’ సినిమాలో నటించింది. ప్రస్తుతం పూజా హెగ్డే రెండు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశం తనకు దక్కిందని చెప్పింది పూజాహెగ్డే. కానీ ఆ సినిమా వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆమె అల్లుఅర్జున్-త్రివిక్రమ్ మూవీకి ఓకే అయ్యిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగులో స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉన్న పూజాహెగ్డే రాబోయే రోజుల్లో బాలీవుడ్‌కు పరిమితమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆమెకు వచ్చిన ఓ బిగ్ ఆఫర్‌తో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమంటున్నారు. బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ రోహిత్ శెట్టి నుండి ఆమెకు ఈ ఆఫర్ వచ్చింది. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రోహిత్ ఇటీవలే ‘సింబా’ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని అక్షయ్‌కుమార్‌తో చేయబోతున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే పూజాహెగ్డే బాలీవుడ్‌లో బిజీ అవుతుందని అంటున్నారు.

Big Offer to Pooja Hegde from Bollywood