Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రష్మికకు లక్కీ ఆఫర్

rshmika

కన్నడ భామ రష్మిక మందన్నకు ఇప్పుడు టాలీవుడ్‌లో వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో తన మొదటి సినిమా ‘ఛలో’తో మంచి హిట్‌ను అందుకున్న ఈ భామ యంగ్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. వరుసగా బోలెడన్ని ప్రాజెక్టులు తన దగ్గరకు వస్తున్నా ఏరికోరి మాత్రమే సినిమాలను ఎంపికచేసుకుంటోంది రష్మిక. ఇప్పటికే  నానీతో ఓ సినిమా, విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని ఈ భామ ఓకే చేసిందట.  ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును కూడా తన ఖాతాలో వేసుకుంటున్నట్లు తెలిసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని  ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాలంటూ దర్శకుడు రష్మికను సంప్రదించాడట. ఈ లక్కీ ఆఫర్‌ను వెంటనే అంగీకరించిందట ఈ యంగ్ బ్యూటీ. కానీ అఖిల్ మూవీ కోసం అడిగిన డేట్స్, విజయ్ దేవరకొండ మూవీకి కేటాయించిన కాల్షీట్లు మధ్య క్లాష్ వచ్చిందట. ఈ విషయంలో దర్శకుడు, ఆమె చర్చిస్తున్నారు. ఇవి సెట్ అయిపోతే అఖిల్‌తో రష్మిక సినిమా ఖాయమైనట్లే.

Comments

comments