Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బాలీవుడ్‌లో బిగ్ ఆఫర్

tamanna

తమన్నా తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ‘బాహుబలి’ సినిమాను మినహాయిస్తే ఏ చిత్రంలోని పాత్ర కూడా ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. అయితే అందంలో తమ న్నా మంచి మార్కులే కొట్టేసిందని చెప్పుకోవచ్చు. ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ లో కూడా సందడిచేసి ప్రేక్షకులను అలరించింది. ఇక అసలు విషయానికొస్తే తమన్నా తాజాగా బాలీవుడ్‌లో ఓ బిగ్ ఆఫర్‌ను దక్కించుకుందట. డైనోసార్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో తమన్నా కీలకమైన పాత్రలో కనిపించనుండగా… అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ దీనికి సంగీతాన్ని అందిస్తాడు. ‘బాహుబలి’ కంటే భారీ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. సౌత్‌లో అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అమ్మడు బాలీవుడ్‌లో ఏకంగా డైనోసార్స్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతుండటం విశేషం. ప్రస్తుతం తమన్నా హీరో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా ‘నా నువ్వే’ సినిమాతో పాటు సందీప్‌కిషన్‌తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది.

Comments

comments