Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

‘సైరా నరసింహారెడ్డి’ కోసం భారీ సెట్స్

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని స్టూడియోలో భారీగా ఉయ్యాలవాడ గ్రామం సెట్‌ను నిర్మించారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్. ఈ సెట్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుంచి మొదలుకానుంది. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్‌ను నిర్మిస్తున్నారు. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి లండన్‌లోని ఇంటర్నేషనల్ విఎఫ్‌ఎక్స్ టీమ్‌తో ఈ సినిమా విషయమై చర్చలు జరుపుతున్నారు. ఇక సినిమా కోసం హైదరాబాద్‌లోని మరో ప్రాంతంలో భారీ కోటను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని తన క్యారెక్టర్ కోసం చిరంజీవి మీసాలు, గడ్డం పెంచాడు. తాజాగా ఈ లుక్‌లో చిరంజీవి… రామ్‌చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ సెట్‌లో దర్శనమిచ్చాడు. లండన్ నుంచి దర్శకుడు సురేందర్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత చిరంజీవి ఫైనల్ లుక్‌ను ఖరారు చేస్తారు.

Comments

comments