Home తాజా వార్తలు పెద్దపులి గోళ్లు స్వాధీనం

పెద్దపులి గోళ్లు స్వాధీనం

చెట్ల పొదల్లో కనుగొన్న పోలీసులు
మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : రాష్ట్రంలోనే సంచలం సృష్టించిన పెద్దపులి చర్మం కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ అధికారుల ఆపరేషన్ సక్సెస్ కాగా శనివారం పెద్దపులి గోర్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పులి గోర్లను సైతం కనుగొన్నారు. రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్‌పోర్స్ సిఐ సాగర్ తన సిబ్బందితో పాటు అటవీశాఖ అధికారులతో సంయుక్తంగా దర్యాప్తును కొనసాగించి పెద్దపులిని హతమార్చిన ప్రాంతానికి వెళ్లి కళేబరానికి చెందిన అవయవాలను సేకరించారు. అంతేకాకుండా కళేబరానికి చెందిన కొని అవయవాలను అటవీ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

అత్యంత కీలకంగా మారిని కేసులో ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారి బాబాన్ కూడా శనివారం సంఘటన స్థలానికి చేరుకొని పులి మృత్యువాత పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. టాస్క్‌పోర్స్ పోలీసులు కీలకమైన పులిని హతమార్చిన ప్రాంతానికి రెండు కిలోమీర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పులిగోర్లను కూడా స్వాధీనం పర్చుకున్నారు.పులికి చెందిన అన్ని అవయవాలు లభ్యం కావడంతో నిందితులను సైతం అదుపులోకి తీసుకొని కేసు విచారణ జరుపుతున్నారు. ఈ సందర్బంగా రామగుండం పోలీస్‌కమీషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ వన్య ప్రాణులను వేటాడే వేటగాళ్లపై పీడియాక్టును ప్రయోగిస్తున్నామన్నారు. అడవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్‌లో అడవుల్లోకి స్మగ్లర్లు వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురయ్యే విధంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. సిపి వెంట ఎఫ్‌డిఓ వెంకటరమణరావును, ఎఫ్‌డిఐ రామలింగయ్య, ఎఫ్‌ఆర్‌ఓ మానయ్య, తదితరులు ఉన్నారు.

 Big Tiger nails captured by Police at Machrial Forest