Home తాజా వార్తలు ఎన్నికల బరిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్

ఎన్నికల బరిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్

Sanjana Anneఅమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల బరిలో బిగ్ బాస్-2 కంటెస్టెంట్, మిస్ హైదరాబాద్, సినీ నటి సాయి సంజన నిలబడింది. నూజివీడు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది సంజన. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ, ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బరిలోకి నిలిచింది. ఆమె సొంత ఊరు నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలోని కృష్ణవరం. సంజన అసలు పేరు అన్నే వనజ. సంజన తండ్రి కోటేశ్వరరావు సామాన్య రైతు. 2016లో మిస్ హైదరాబాద్‌గా గెలిచిన అన్నే వనజ ఆ తర్వాత ఆమె పేరును సంజనగా మార్చుకుంది. ఇక బిగ్‌బాస్-2లో సామాన్యురాలిగా ప్రవేశించి, మాటలతో హీటెక్కించి సంజన వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో సంజన ఓ చిన్న పాత్రలో నటించింది. మాజీ మంత్రి, దివంగత పాలడుగు వెంకట్రావుకు ఈమె సమీప బంధువు.

Bigg Boss 2 Telugu Contestant Sanjana Anne Contest in AP Polls