Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఎన్‌టిఆర్ ‘బిగ్‌బాస్ షో’ లేటెస్ట్ టీజర్

NTR

యంగ్‌టైగర్ ఎన్‌టిఆర్ ‘బిగ్‌బాస్ షో’ ద్వారా త్వరలోనే తొలిసారి బుల్లితెరపై కనువిందు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ ఒకటి విడుదల చేసింది షో యూనిట్. తాజాగా ఈ ప్రోగ్రాంకు సంబంధించిన మరో టీజర్ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇందులో ఎన్టీఆర్ ఉద‌యాన్నే నిద్ర‌లేచి టీ తాగుతుండ‌గా, ఎదురుగా ఉన్న కెమెరాల‌ని చూసి షాక్ అవుతాడు. కెమెరాల‌ని బిగ్ బాస్ హౌస్ లో పెట్ట‌మంటే నా ఇంట్లో పెట్టారేంటి అనే డైలాగ్ తో ఈ టీజర్ రూపొందించారు. ఈ ప్రోమో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ప్రస్తుతం షో షూటింగ్ ముంబయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ‘బిగ్‌బాస్ షో’ ‘స్టార్ మా’ టివిలో ప్రసారం కానుంది.

Comments

comments