Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆరోగ్యజిల్లాగా పెద్దపల్లి

collector

*జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన
మనతెలంగాణ/పెద్దపల్లి: ఆరోగ్య జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దడంలో అందరు తమ వంతు పాత్రను పోషించాలని జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఆదివారం స్థానిక ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి, ఎంఎల్‌సి భానుప్రసాదరావు,ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ రాష్ట్ర చైర్మన్ పాపారావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజారొగ్య సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్య సిబ్బందితో వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అదించే విదంగా ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయండం జరిగిందని, ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుంతని తెలిపారు. వైద్య శిబిరం విజయవంతం జరగడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పనిచేశారిని కలెక్టర్ తెలిపారు.
రిజిస్ట్రేషన్ కౌంటర్లు, రెండు స్కానింగ్ కౌంటర్లు, 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్తపాలనాధికారి వనజాదేవి,పెద్దపల్లి ము న్సిపాల్ చైర్మన్ రాజయ్య,జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ ఇండియా ప్రతినిధి అశోక్‌రావు, జిల్లా ఇన్‌చార్జీ డిఆర్‌డిఒ ప్రేమ్‌కుమార్, ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటి కార్యదర్శి మదన్‌మోహన్, జిల్లా వెద్యధికారి డా.ప్రమో ద్‌కుమార్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Comments

comments