Home దునియా గాలిని శుద్ధి చేసే టవర్!

గాలిని శుద్ధి చేసే టవర్!

Air Tower

 

వాయుకాలుష్యం… ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. చైనా కూడా అందులో ఒకటి. దానికి పరిష్కారంగానే ఆ దేశం స్థానిక జియాన్ నగరంలో వంద మీటర్ల ఎత్తులో ఈ టవర్‌ని నిర్మించింది. దీనికీ కాలుష్యానికీ సంబంధం ఏంటంటారా… ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్ ప్యూరిఫయర్. సౌరశక్తితో పనిచేసే ఈ టవర్ కాలుష్యపూరితమైన గాలిని గ్రహించి దాన్ని వేడిచేసి, ఫిల్టర్లద్వారా శుభ్రంచేసి బయటికి పంపిస్తుంది. అలా పది చదరపు కి.మీ పరిధిలో రోజుకి కోటి క్యూబిక్ మీటర్ల గాలిని శుభ్రం చేస్తుందట. ఈ టవర్ పెట్టాక చుట్టుపక్కల గాలిలో కాలుష్యం చాలావరకూ తగ్గిందట. ఎంత మంచి ఆలోచనో… కదా!

Biggest Air Purifier Tower in Ziyon City in China
World’s Biggest Air Purifier Tower in China