Home కెరీర్ డిసెంబర్ 30న అతిపెద్ద జాబ్ మేళా

డిసెంబర్ 30న అతిపెద్ద జాబ్ మేళా

JOB-MELA-1హైదరాబాద్ : స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 30న రాష్ట్రంలో అతిపెద్ద జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా హైదరాబాద్, రంగారెడ్డి, చేవెళ్ల, నారాయణపేట్, మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగనుంది. వివిధ కార్పొరేట్ సంస్థల్లో ప్రైవేట్, కాంట్రక్ట్ ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులు ఈ జిల్లాల్లో జరిగే జాబ్ మేళా కోసం ముందస్తుగా ధరఖాస్తు చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు సోమశేఖర్ పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వివరాల కోసం 7095857605/83742288988 ఫోన్ చేయవచ్చని తెలిపారు.