Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

చెట్లకు రాఖీ కట్టిన ముఖ్యమంత్రి

Nitish-Kumar-Rakhi

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా రాఖీ పండుగను సందేశాత్మకంగా జరుపుకున్నారు. ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ తో కలిసి ఆయన పాట్నాలోని కొన్ని చెట్లకు రాఖీలు కట్టారు. చెట్లను కూడా సంరక్షించేందుకే ఈ విధంగా రక్ష బంధన్ జరుపుకున్నామని నితీశ్ తెలిపారు. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా అభివృద్ది చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొక్కలను సంరక్షించాలని చెప్పేందుకు ఇది ఒక సంకేతం. హరితవనం పెంచాలని చెప్పడం దీని ఉద్దేశం. ఇది పర్యావరణానికి అత్యంత ముఖ్యమైనది అని నితీశ్ అన్నారు. తన సందేశాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకున్నారని, తమ రాష్ట్రంలో గ్రీనరీ కూడా బాగా పెరిగిందని తెలిపారు. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని తెలిపారు.

Comments

comments