Home జాతీయ వార్తలు ఓటేసిన అవిభక్త కవలలు

ఓటేసిన అవిభక్త కవలలు

Bihar conjoined twins elated voting for first time

 

పట్నా: ఒకే తలతో పుట్టిన అవిభక్త కవలలు మొదటిసారి ఓటేశారు. పై ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు అమ్మాయిల పేర్లు సాబా, ఫరాహ్. బీహార్‌లోని పాట్నాకు చెందిన వీరికి 19 సంవత్సరాలు. ఒకే తలతో ఉన్నా, వారికి ఎన్నికల సంఘం రెండు ఓటరు కార్డులను జారీ చేసింది. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ ఇద్దరూ కలిసి ఓటేయకూడదు. ఒకరు ఓటేస్తుంటే మరొకరు చూడకూడదు. ఎవరికి ఓటేశారో చెప్పకూడదు. కాని ఇవన్నీ వీరికి వర్తించవు. ఎందుకంటే వారికి శరీరాలు రెండైనా, తల మాత్రం ఒకటే. అవిభక్త కవలలుగా పుట్టిన వీరు మేజర్లు కావడంతో ఇసి నిబంధనలను సడలించింది. దీంతో వీళ్లిద్దరు కలిసే ఓటేశారు.

Bihar conjoined twins elated voting for first time