Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వాజ్‌పేయిని విమర్శించాడని చావగొట్టారు..!

పాట్నా: దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని విమర్శించాడంటూ ఓ వ్యక్తిని కొందరు చావగొట్టారు. వాజ్‌పేయిని విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు గాను కొందరు వ్యక్తులు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. బీహార్‌లోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యూనివర్సిటీలో సోషియాలజీ విభాగంలో సంజయ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అయితే, వాజ్‌పేయిపై ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రాహుల్ పాండే, అమన్ బిహారీ వాజ్‌పేయి దాదాపు 25 మందిని తీసుకొచ్చి సంజయ్ పై దాడికి దిగారు. తనపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు యత్నించినట్టు బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ‘‘నువ్వు మరో కన్నయ్య కుమార్ కావాలనుకుంటున్నావా?’’ అంటూ ఓ వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అడుగుతున్నట్టు కూడా ఉంది. కాగా, ఇప్పటికే పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

comments