Home జాతీయ వార్తలు ఒడిశాలో బిజెడి ముందంజ

ఒడిశాలో బిజెడి ముందంజ

 

ఢిల్లీ: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బిజెడి 101 సీట్ల ఆధిక్యంలో ఉండగా బిజెపి 20 సీట్లు, కాంగ్రెస్ 15 స్థానాలు, ఇతరులు ఒక సీటు ముందంజలో ఉన్నారు. ఒడిశాలో 147 స్థానాలలో 74 స్థానాలు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలుంటాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో శాసన సభ ఎన్నికలలో బిజెపి 16 స్థానాల్లో ముందంజలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలలో 31 గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. సిక్కిం ఎస్‌డిఎఫ్ రెండు స్థానాలు, ఇతరులు ఏడు స్థానాలు ముందంజలో ఉన్నారు. సిక్కింలో మొత్తం 32 స్థానాలలో 17 స్థానాలు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.  ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి 148 స్థానాల్లో ముందంజలో ఉండగా టిడిపి 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. ఎపిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 88 స్థానాల్లో విజయం సాధిస్తే సరిపోతుంది.

 

Biju Janata Dal Lead in Odisha Assembly Elections