Home తాజా వార్తలు తృటిలో తప్పిన ప్రమాదం….

తృటిలో తప్పిన ప్రమాదం….

Bike-Accident
కాల్వశ్రీరాంపూర్: ఆర్టీసి బస్సు కింద బైక్ పడిన సంఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడిన సంఘటన మండల కేంద్రమైన కాల్వశ్రీరాంపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మూలమలుపు వద్ద బస్సును మలుపుతున్న క్రమంలో బైక్ నడుపుతున్న ఎండి ఖలీల్ అనే యువకుడు ప్రమాదవశాత్తు బస్సు వెనుక భాగంలో ఢీకొని కింద పడ్డాడు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో బైక్ వెనుక చక్రాలకింద ఇరుక్కుపోగా, బైక్ నడుపుతున్న యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో బైక్ కొంత భాగం దెబ్బతినగా, ఖలీల్ ప్రాణాలతో బయటపడడంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Bike Accident at Kalva Srirampur in Peddapalli Dist