Home జాతీయ వార్తలు బైక్‌ను ఇలా స్టార్ట్ చేశాడు.. అలా మంటలు అంటుకున్నాయి…(వీడియో)

బైక్‌ను ఇలా స్టార్ట్ చేశాడు.. అలా మంటలు అంటుకున్నాయి…(వీడియో)

Bike catch fire when biker starts in Tamilnadu

చెన్నై: త‌మిళ‌నాడులోని తిరున‌ల్‌వెల్లిలో ఓ ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఇలా స్టార్ట్ చేయగానే అలా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వాహన చోదకుడికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ప్రస్తుతం బాధితుడు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా… తిరున‌ల్‌వెల్లిలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోసుకున్న బైక‌ర్‌ అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు త‌న ద్విచక్రవాహనాన్ని స్టార్ట్ చేశాడు. అంతే బైక్‌ను స్టార్ట్ చేసిన మరో క్ష‌ణంలోనే ఒక్కసారిగా వాహనం పెట్రోల్ ట్యాంక్ నుంచి మంట‌లు వ్యాపించాయి. దీంతో బైక్‌పై కూర్చున్న వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. వెంట‌నే అతడు ద్విచక్రవాహనాన్ని కిందపడేసి పక్కకు పరుగులు తీశాడు. ఇది గమనించిన అక్క‌డ వారు వెంటనే వాహనంలో చెల‌రేగిన మంట‌ల్ని ఆర్పివేశారు. దీంతో పెట్రోల్ బంక్‌లో భారీ ప్ర‌మాదం త‌ప్పింది. అనంతరం గాయపడిన వ్యక్తిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.