Home తాజా వార్తలు ద్విచక్ర వాహనాలు దగ్ధం

ద్విచక్ర వాహనాలు దగ్ధం

 

మన తెలంగాణ/ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అర్ధరాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో ఇంటి ఆవరణలో నిలిపివున్న రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం….  మండల పరిధిలోని ఇందిరానగర్ గ్రామపంచాయితీలో గల సుందరయ్యనగర్‌కు చెందిన జొన్నల మోహన్‌రావ్ సింగరేణి బిఎస్‌ఎన్‌ఎల్ తాత్కాలిక కార్మికుడు పని చేస్తూ ఇక్కడే గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. గతరాత్రి ఆయన కుంటుంబసభ్యులతో నిద్రిస్తున్న సమయంలో వారికి చెందిన రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఉదయమే వాహనాలు దగ్ధం చేసినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Bikes Burn in Bhadradri Kothagudem