Home జాతీయ వార్తలు 186 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు : సుష్మా

186 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు : సుష్మా

Bilateral Talks with 186 Countries : Sushma

ఢిల్లీ : బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 186 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. విదేశాంగ శాఖ సాధించిన విజయాల గురించి ఆమె వివరించారు. వివిధ దేశాల్లో చిక్కుకున్న 90వేల మంది భారతీయులను రక్షించామని ఆమె వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో 192 దేశాలకు సభ్యత్వం ఉందని, అన్ని దేశాల్లో పర్యటించాలని అనుకున్నామని, అయితే ఇప్పటి వరకు 186 దేశాల్లో అధికారులు పర్యటించినట్టు ఆమె పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఉగ్రవాదం, చర్చలు ఒక్కసారి కుదరవని ఆమె స్పష్టం చేశారు. పాక్ ఎప్పుడూ చరిత్రను వక్రీకరిస్తుంటుందని , వాళ్లు చట్టాన్ని నమ్మరని ఆమె ఆరోపించారు. భారత్ సరిహద్దు దేశాలతో ఎప్పుడూ సత్సంబంధాలే కోరుకుంటుందని తెలిపారు. శాంతితోనే ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపడుతాయని ఆమె స్పష్టం చేశారు. భారత్ శాంతికాముక దేశమని ఆమె పేర్కొన్నారు.

Bilateral Talks with 186 Countries : Sushma