Search
Sunday 18 November 2018
  • :
  • :

బిల్ట్ చర్చలు వాయిదా

meting

*15 రోజుల గడువు అడిగిన యాజమాన్యం
* ఒక్క నెల వేతనం వేసేందుకు ముందుకు వచ్చిన యాజమాన్యం
*ఆగ్రహం వ్యక్తం చేసిన డిఫ్యూటీ సిఎం, చందూలాల్

మన తెలంగాణ/మంగపేట : మండలంలోని సమస్యాత్మకంగా మారిన బిల్ట్ కర్మాగార పునఃప్రారంభం విషయం మళ్ళీ వాయిదా పడ్డాయి. గత ఫిబ్రవరి 19న జరగాల్సిన చర్చలను బిల్ట్ యాజమాన్యం అప్పటిలో మరో నాలుగువారాల పాటు గడువు కావాలని కోరింది. దీంతో ప్రభుత్వం కార్మిక నాయకులు నాలుగు వారాలు గడువును ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కాగా ఇటీవల కార్మిక నాయకులు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకు రావడంతో మంగళవారం డిఫ్యూటీ సీఎం సమక్షంలో చర్చలు జరిగాయి. చర్చల సారాంశంలో బాగాంగా యాజమాన్యం మాట్లాడుతూ కర్మాగారాన్ని నడిపించేందుకు సిద్దంగా ఉన్నామని కానీ దానికి కొంచం గడువు కావాలని కోరారు. దీంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆజ్మీరా చందులాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్త చేశారు. ఇంత కాలం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు నాయకులు తెలిపారు. దీంతో స్పందించిన యాజమాన్యం 15 రోజుల్లో అన్ని విధాలుగా కర్మాగారాన్ని తెరిపించేందుకు సంసిద్దం అయ్యి కర్మాగార ఎండీ గౌతం థాపర్‌తో మాట్లాడి కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అనంతరం కార్మికులకు సంబంధించిన వేతనాలను సైతం మంగళవారం వారి వారి ఖాతాలో ఒక్క నెల వేతనం వేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. చర్చల్లో డిఫ్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి అజ్మీరా చందులాల్, బిల్ట్ సీఈఓ నిహార్ అగర్వాల్, డీజీఎం కేశవరెడ్డి, కార్మికశాఖ అధికారి భాగ్యా నాయక్,  బిల్ట్ కార్మిక నాయకులు పాకనాటి వెంకట రెడ్డి,  వడ్డేబోయిన శ్రీనివాస్, వడ్లూరి రాంచందర్, వంగేటి వెంకటరెడ్డి, కుర్బాన్ ఆలీ, పప్పు వెంకటరెడ్డి, డీవీపీ రాజు, మేడ లక్షిమనారాయణ, పుసులూరి గణపతి, వింజమూరి రవిమూర్తి, వీవీఎస్‌ఆర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments