Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కోటీశ్వరుడు …. కార్పొరేటర్‌గా పోటీ

PARAG

ముంబయి : బృహత్ ముంబయి పురపాలక (బిఎంసి) ఎన్నికల్లో కార్పొరేటర్  స్థానానికి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి కోట్లకు పడగలెత్తాడు. ఆయన బిజెపి తరపున పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతాకు సన్నిహితుడు. అతడి పేరు పరాగ్ షా. అతనో రియల్టర్. ఘట్కోపర్ వార్డు నుంచి పోటీ చేస్తున్న షా తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.690 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపారు. స్థిరాస్థులు రూ.20 కోట్ల వరకు ఉంటాయని వెల్లడించారు. ఫిబ్రవరి 21న 227 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తాను రాజకీయాలకు కొత్త అని, తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షా తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పారు. ప్రజలకు పారదర్శక పాలన అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments