Search
Wednesday 14 November 2018
  • :
  • :

కెరీర్‌కు బింద్రా వీడ్కోలు

bindhraన్యూఢిల్లీ : బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా షూటింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రియో ఒలింపిక్స్ పోటీలే తన చివరి టోర్నీ అని ముందుగానే పేర్కొన్న బింద్రా ఆదివారం జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా(ఎన్‌ఆర్‌ఎఐ) నిర్వ హిం చిన ఫేర్‌వెల్ కార్యక్రమంలో అధికారికంగా తన రిటైర్మెం ట్‌ను ప్రక టించాడు. ఈ సందర్భంగా ‘యువ షూ టర్లకు అవకాశం కల్పిం చేందుకు ఇదే సరైన సమయం’ అని బింద్రా పేర్కొన్నాడు. ఇది భావోద్వేగమైన రోజు. రియోలో నేను పతకం నెగ్గలేదు. నాల్గోస్థానంతోనే సరిపెట్టుకున్నా. అయినా ఇది నా రెండు దశాబ్దాల కెరీర్‌కు ఘనమైన ముగింపేనని బింద్రా అన్నాడు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. దానికి మరో దారిలేదని నమ్మేవాడనని బింద్రా చెప్పాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన బింద్రా బీజింగ్ ఒలింపిక్స్‌లో 10మీ॥ ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం సాధించాడు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన ఏకైక ప్లేయర్ బింద్రానే.
రియో గతం.. భవిష్యత్తును చూడండి: రియో ఒలింపిక్స్‌లో షూటర్ల వైఫల్యాలపై సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ సారథి అభినవ్ బింద్రా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘రియో అనేది ముగిసిన అధ్యాయం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ముందున్న భవిష్యత్తును గురించి ఆలోచించండని’ బింద్రా పేర్కొన్నాడు. రియోకు వెళ్లిన జట్టులో తాను సభ్యుడినని, వైఫల్యాలపై తనతో ప్రశ్నలు అడిగించొద్దని బింద్రా పరోక్షంగా పేర్కొన్నారు.

Comments

comments