Home నిర్మల్ బాసర ఆలయంలో బయోమెట్రిక్

బాసర ఆలయంలో బయోమెట్రిక్

రేపటి నుంచే  అమల్లోకి
సాంకేతిక  సహాయంతో  భక్తులకు
మెరుగైన సేవలు
ఇక నుంచి ఎగనామం కష్టమే

BASARAబాసర: బాసర ఆలయం ఉద్యోగుల సమయ పాలన విధులకు సంబ ంధించి విప్లవాత్మక నిర్ణయం అమలుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో బయో మెట్రిక్ పద్ధతిన హాజరు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆరంభ దశలో ఉన్న ఈ ప్రక్రి యను త్వరతిగతిన పూర్తి చేసి వచ్చే నూతన సంవత్సరం నుంచి బయో మెట్రిక్ పద్ధతికి శ్రీకారం చుట్టాలని అధికారులు భావిస్తున్నారు.

బయోమెట్రిక్ హజరు ప్రక్రియ అమలులోకి వస్తే ఉద్యోగుల పని తీరు మెరుగు పడి  భక్తులకు అందించే సేవల ను విస్తృత పర్చవచ్చని అధికా రుల అలోచన. ఈ మేరకు ఉద్యోగుల నుంచి వేలి ముద్రల సేకరణ ప్రక్రి యను పూర్తి చేశారు. ఆలయంలోని ఉద్యోగులను ఆర్చకులు, సాధారణ సిబ్బంది, తాత్కాలిక సిబ్బంది, ఔట్ సోర్సింగ్, తాత్కాలిక ఎన్‌ఆర్‌ఎం లుగా 5 విభాగాలుగా విభజించి హాజరు విధానాన్ని రూపొందిస్తు న్నారు. హాజరులో అక్రమాలు చోటు చేసుకోకుండా  సమయ పాలన ఖచ్చితంగా పాటించిన షిఫ్టుల వారీగా ఉద్యోగుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. వీలైనంత వేగంగా సాంకేతిక ప్రక్రియను ముగించి జనవరి 1 నుంచి బయోమేట్రిక్ విధానాన్ని అరంభించాలని ఆలయ అధికారులు భావి స్తున్నారు.

30 నిమిషాలు మినహాయింపు….
బయోమేట్రిక్ విధానంలో ఉద్యోగులు 30నిమిషాల ఆలస్య సౌలభ్యం లభిం చనుంది. ఏదైనా అవంతరాలతో 30 నిమిషాలు ఆలస్యమైనా గైర్హారుగా నమోదు కాకుండా వెలుసుబాటు కల్పిస్తున్నారు. ఒకసారి బయోమేట్రిక్ అమలులోకి వస్తే ఉద్యోగుల విధులకు ఏగనమానానికి ఆడ్డుకట్ట పడుతుంది. కొన్ని సంవత్సరాలుగా బాసర ఆలయంలో ఉద్యోగులు తమ విధుల నిర్వహణలో సమయ పాటించడంలో విఫలం అవుతున్నారు. తమకు అనుకులమైన సమయంలో ఇష్టారీత్య విధులకు హజరు కావడం, హజరు కాకపోయిన హజరైనట్లు నమోదు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బయోమేట్రిక్ అమలైతే ఇలాంటి అవలక్షణాలకు ఆడ్డుకట్టపడనుంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో హాజరు నమోదు చేస్తుండడంతో ఉద్యోగుల హజరు శాతం పెరగనుంది.

విధులకు ఏగనమమం కష్టం…
ఉద్యోగులు విధులకు ఏగనమమం పేట్టకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఇక నుంచి ఏగనమమం కష్టం తరం అవుతుంది. దీంతోపాటు ఆలయ వ్యవహారాల్లో పారదర్శకత పెంచేలా అధికారులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆలయంలో ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలతో మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను పెంచనున్నారు.

ఆలయ ఉద్యోగులు, ఆర్చకుల పని తీరు మెరుగు పర్చడానికి, పరిశీలన చేయడానికి వారిని నిఘా పరిధిలోకి తీసుకోరానున్నారు.  బుకింగ్ కార్యాలయాలు, అక్షరాస్య మండపలు, గర్భగుడి, బయోమేట్రిక్ యంత్రాల ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఆదునాతన కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.ఈ మేరకు ఆ ప్రక్రియ పూర్తి అయింది. త్వరలో ఆలయంలో రూ. 17 లక్షల వ్యయంతో ఏర్పాటుకు సన్నహలు ప్రారంభించారు.  సాంకేతిక సహయంతో భక్తులకు మెరుగైన సేవల

బాసర ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు
సాంకేతిక సహయంతో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని, ఆలయ వ్యవ హారాల్లో పారదర్శకతకు పెద్ద పీఠ వెస్తున్నామని, భక్తులను అందించే సేవాలను మెరుగు పర్చాడనికి ఏప్పటికపుడు చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో ఆలయంలో ఉద్యోగుల హాజరు కోసం బయోమేట్రిక్ నిఘా కోసం ప్రత్యేక సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.