Home నవ విజ్ఞానం శబ్దాల అర్థాలు గ్రహించే పక్షులు

శబ్దాల అర్థాలు గ్రహించే పక్షులు

Birds

ఆస్ట్రేలియా పాటల పక్షి ‘ఫెయిరీ- వెన్’ ఇతర పక్షుల భాషల పరిజ్ఞానంతో పుట్టలేదు. కానీ కొన్ని కీలకమైన పదాల అర్థం మాత్రం తెలుసుకోవడంలో ఘనాపాటి. కొన్ని జంతువులు  ఇతర తెగల భాషలను అర్థం చేసుగోగలవని మనకు తెలుసు. కానీ వాటికి భాషా పరిజ్ఞానం ఎలా వచ్చిందో మనకు తెలియదు. యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టన్ బయోలజిస్టు యాండ్రూ రాడ్‌ఫర్డ్ చెప్పారు. జీవన నైపుణ్యాలను తెలుసుకోవడానికి పక్షులకు అనేక మార్గాలున్నాయి. కొంత అంతరజ్ఞానం ఉండగా, మరికొంత నేరుగా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది. రాడ్‌ఫర్డ్, మరికొంతమంది శాస్త్రవేత్తలు మూడోరకం జ్ఞానాన్ని కనుగొనగలిగారు. సమకాలికుల నుంచి సమాచారం సేకరిస్తూ వీరు కెన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా జాతీయ బొటానికల్ గార్డెన్ల చుట్టూ సంచరించారు.

ఇటువంటి పక్షులు శబ్దానికే స్పందిస్తాయి తప్ప ఇతర పక్షుల ప్రవర్తనను గమనించవని తెలుసుకున్నారు. వీరు మొదట తెలియని రెండు పక్షుల శబ్దాల రికార్డు వినిపించారు. ఈ శబ్దాలలో ఒకటి ఆస్ట్రేలియాకు చెందిన పక్షి శబ్దం, రెండోది కంప్యూటర్ తయారు చేసిన పక్షి అనుకరణ శబ్దం. ఈ శబ్దాలను మొదట విన్న తరువాత 16 ఫెయిరీ రెన్ పక్షులులో ఎలాంటి స్పందన కనిపించలేదు. అప్పడు పరిశోధకులు తొందరగా నడుస్తూ పార్కు చుట్టూ తిరుగుతూ సంప్రదాయ రికార్డింగ్ వినిపించడం కొనసాగించారు. సగం పక్షులకు ‘ధార్న్ బిల్ పక్షి హెచ్చరిక కూతలను గుర్తించేలా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించారు.

మిగతా సగం పక్షులకు కంప్యూటర్ పుట్టించిన అయిష్టత పిలువులా వినిపించే శబ్దాన్ని గుర్తించేలా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించారు. మూడు రోజుల తరువాత పక్షులు ఎంతవరకు నేర్చుకున్నాయో పరీక్షించారు. రెండు వర్గాల ఫెయిరీ వెన్స్ పక్షులు శబ్దాలకు స్పందించాయి. మిగతా శబ్దాలకు ఇవి స్పందించలేదు. 16 పక్షుల్లో 12 ప్రతిశబ్దాన్ని ఆలకించి వెంట్రుకలు నిక్కబొడిచేలా స్పందించాయి. మిగతా 14 పక్షులు మూడోవంతు మాత్రమే స్పందించాయి. ఎక్కువగాశబ్దాలు విన్నాయి.