Home తాజా వార్తలు ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

abdul kalamశంషాబాద్: జిల్లాలోని లీడ్ ఇండియా భవన్‌లో శనివారం భారతరత్న గ్రహీత, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం 85వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇండియా భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కలాం కాంస్య విగ్రహాం వద్ద పలువురు ప్రముఖులు పుష్పాగుచ్ఛాలు ఉంచి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతోపాటు ప్రధానకార్యదర్శి కిచ్చెన్నగారి లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలాం నిరాడంబర జీవితాన్ని స్మరించుకున్నారు. అంతేగాక ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.