Home ఆదిలాబాద్ తాండూర్‌లో అడవి దున్న సంచారం

తాండూర్‌లో అడవి దున్న సంచారం

గ్రామంలో అడవి దున్న దృశ్యం
animalఆదిలాబాద్: తాండూర్ మండలంలో సోమవారం ఉదయం రైల్వే ట్రాక్ మీదుగా పలు పరిసర ప్రాంతాలల్లో అడవి దున్న సంచరిస్తూ కొంత ఆశ్ఛర్యానికి, కొంత భయానికి గురి చేసింది. ఎందుకంటే ఉదయం పూట గేదెలు గ్రామాల నుండి భయటకు వెళ్లుతాయి. అదే విధంగా అడవి దున్న గేదె మాదిరిగా ఉంటుంది కాబట్టి సరిగా గుర్తు పట్టలేము. తాండూర్‌కు చెందిన ఆటో ట్రాలీ యాజమాని నవాబుఖాన్ గుర్తించి, అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు అధికారులను మన తెలంగాణ సంప్రదించగా అడవి దున్న సంచారం నిజమేనని, అడవి దున్నను అడవికే తరలిస్తామని అటవీ అధికారులు తెలిపారు.