Search
Friday 21 September 2018
  • :
  • :

విజయ్ మాల్యాకు చేదు అనుభవం

MALYA

లండన్ : భారత్‌లో వివిధ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత్ , దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి వెళుతున్న విజయమాల్యాను చూసి కొందరు దొంగ … దొంగ అంటూ అరిచారు. దీంతో విజయ్ మాల్యా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని మారు మాట్లాడకుండా ఆయన స్టేడియంలోకి వెళ్లిపోయారు. కొందరు ఆయను ఫొటోలు తీసి హేళనగా నవ్వారు. దీంతో మాల్యా బిక్క చచ్చిపోయారని మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన కొందరు భారతీయులు తెలిపారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కూడా ఆయన స్టేడియంకు వచ్చి మ్యాచ్‌ను తిలకించారు. కోహ్లీ ఫౌండేషన్ ఇచ్చిన విందుకు కూడా ఆయన హాజరయ్యారు. విజయమాల్యా వివాదస్పదుడు కావడంతో కోహ్లీతో పాటు ఆయన టీమ్ మాల్యాకు దూరంగా ఉన్నారు. అయితే పాక్‌తో మ్యాచ్ సందర్భంగా విజయ్ మాల్యా సునీల్ గావాస్కర్‌తో మాట్లాడడం చర్చనీయాంశమైంది.

Comments

comments