Home తాజా వార్తలు పనుల్లో నాణ్యత లోపం…

పనుల్లో నాణ్యత లోపం…

Bitti road turned into potholes

 

ఆదిలాబాద్: గుంతలమయమైన బీటీ రోడ్డు… మరు మూల గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలను తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీటీ రోడ్డు నిర్మాణాలను ప్రారంభించారు. అందులో భాగంగా మండలంలోని గొడిసిర్యాల్ గ్రామానికి బిటి రోడ్డు నిర్మాణాన్ని 2016లో ఒక కోటీ 24 లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మించారు. ఈ బీటీ రోడ్డు నిర్మాణంతో ప్రజలు రోడ్డు కష్టాలు తీరుతాయని ఆశ పడ్డారు. కాని ప్రజలు రోడ్డు కష్టలు మళ్లీ మొదటికి వచ్చాయి. దీంతో గ్రామ ప్రజలు రోడ్డు పై ప్రయాణించాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకప్పుడు బీటీ రోడ్డు నిర్మాణం కావాలని ఆందోళన చేపట్టారు. కానీ నేడు గుంతలుగా మారిన బీటీ రోడ్డు పై మళ్లీ ఆందోళనకు గ్రామస్తులు సిద్దమవుతున్నారు.

పనుల్లో నాణ్యత లోపం…
మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యమైన తారు, నాణ్యమైన కంకర వాడకపోవడంతో రోడ్డు అంత గుంతలుగా మారిపోయింది. దీంతో గ్రామాస్తులు పనుల్లో పూర్తిగా నాణ్యత లోపం కనబడుతుందని, రోడ్డు వేసి 2 సంవత్సరాలు కూడా గడవక ముందే రోడ్డు చెడి పోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు ఇష్టం వచ్చిన రీతిలో పని పూర్తి చేసి మమ అనిపించాడంతో రోడ్డు అంత పూర్తిగా గుంతలుగా మారింది.

కరువైన అధికారుల పర్యవేక్షణ…
గుత్తేదారు నిర్మించిన బీటీ రోడ్డు నాణ్యత లోపం ఒక వైపు ఉంటే అధికార యంత్రాంగం ఆ లోపాన్ని సరిచేయకుండా నాణ్యమైన తారు రోడ్డు వేయకపోవడంతోనే గుంతలుగా మారి ప్రయాణానికి ఇబ్బందిగా ఏర్పడిందని ప్రజలు అంటున్నారు. నిర్మించిన బీటీ రోడ్డు ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండగా రెండు సంవత్సరాలకి గుంతలుగా మారింది. సంభందిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మరల బీటీ రోడ్డు వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైన అధికారులు స్పందించి గుంతలుగా మారిన బీటీ రోడ్డును సరిచేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించి రెండు సంవత్సరాలు కాకముందే బీటీ రోడ్డు పూర్తిగా గుంతలుగా మారి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది.బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యమైన కంకర నాణ్యమైన తారు వాడకపోవడంతో గుంతలుగా మారడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి గుంతలుగా మారిన రోడ్డును మళ్ళీ సరి చేయాలని కోరుకుంటున్నాం.

Bitti road turned into potholes in Nirmal