Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కొంపముంచిన వాట్సాప్…!

Bizarre: UP family calls off marriage on wedding day

లక్నో: స్టార్స్ మొదలుకొని సామాన్యుడి వరకు అందరికీ సోషల్ మీడియా అనేది ఏం చెప్పాలన్న ఒక గొప్ప వేదిక. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయిందీ సోషల్ మీడియా. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఏదో ఒక యాప్ ఓపెన్ చెయ్యనిదే చాలా మందికి ఆ రోజు మొదలవ్వదంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుత యువత సామాజిక మాధ్యమాల్లోనే రోజంతా గడుపుతోంది. పలు సందర్భాల్లో ఇది వారి వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇక భారత్‌లో అత్యధికంగా ఉపయోగించే మెసెంజర్ యాప్ వాట్సాప్. ఈ వాట్సాపే తాజాగా ఓ పెళ్లి పెటాకులు కావడానికి కారణమైంది. పెళ్లి కుమార్తెకు వాట్సాప్‌ వినియోగం ఓ వ్యసనంగా మారడంతో వరుడు తరఫు బంధువులు పెళ్లి రద్దు చేసుకున్న వింత సంఘటన ఒకటి తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా నౌగాం సదత్ లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యువతిని వధువుగా ముస్తాబు చేసి వరుడి రాకకోసం ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల ఎదురుచూస్తున్నారు.

వారి ఎదురుచూపులకు తెర దించుతూ వరుడి తరఫు వారు అక్కడికి చేరుకున్నారు. వారు వస్తు వస్తూనే ఈ పెళ్లి జరగదంటూ షాకిచ్చారు. అది విన్నా వధువు తరఫు వారు కంగుతిన్నారు. అసలు తాము విన్నది నిజమేనా? లేక వరుడి తరఫు వారు పరాచకాలు ఆడుతున్నారా? అనేది వారికి కాసేపు అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత తెరుకొని అసలేం జరిగిందని అడిగారు. దీనికి సమాధానంగా… వధువు నిత్యం వాట్సాప్‌లోనే ఉంటుందని, అలాంటి కోడలు తమకు అక్కర్లేదని తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చివరికి చేసేదేమిలేక వధువు తల్లీదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అన్యాయంగా తమ కూతురిపై నిందలు వేస్తున్నారని, రూ.64 లక్షలు కట్నం డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వరుడి తరుఫు వారిని స్టేసన్ కు పిలిపించి విచారణ చేపట్టారు.

Comments

comments