Home జాతీయ వార్తలు త్రిపురలో బిజెపి సంబురాలు

త్రిపురలో బిజెపి సంబురాలు

TRIPURA-BJP

అగర్తలా : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. త్రిపురలో బిజెపి కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. త్రిపురలో బిజెపి-ఐపిఎఫ్‌టి కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని లెఫ్ట్ కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఐదు దశాబ్దాలు అధికారంలో ఉన్న లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికల్లో బిజెపి గట్టి షాక్ ఇచ్చింది. త్రిపురలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, తాము ఊహించని స్థానాల్లో కూడా ఆధిక్యంలోకి వస్తున్నామని బిజెపి నేత రామ్ మాధవ్ తెలిపారు.

BJP Activists Happy Celebrations in Tripura