Home జాతీయ వార్తలు దొంగ ఓట్లు వేయండి.. నేను చూసుకుంటా…!(వీడియో)

దొంగ ఓట్లు వేయండి.. నేను చూసుకుంటా…!(వీడియో)

Sanghmitra Mauryaలక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి సంఘమిత్ర మౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకుంటే వారి పేరున దొంగ ఓట్లు వేయండి అంటూ సంఘమిత్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో పాల్గొన్న మౌర్య మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకుంటే వారి పేరున దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా వేసేయండి. మిగతాది నేను చూసుకుంటా. నేనేంటో తెలుసుగా అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అంతేగాక ఈ తతంగమంతా రహస్యంగా జరిగిపోవాలని చెప్పడం కూడా వీడియోలో రికార్డైంది. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్ లా మారింది. యుపి మంత్రి స్వామి ప్రసాద్ కూతురైన సంఘమిత్ర.. సమాజ్ వాది పార్టీకి చెందిన ఎంపి ధర్మేంద్ర యాదవ్ పై పోటీ చేస్తున్నారు. మూడో దశ పోలింగ్ లో భాగంగా ఏప్రిల్ 23న బదౌన్ లో ఎన్నికలు జరుగనున్నాయి.

BJP candidate asks supporters to opt for fake voting