Search
Saturday 17 November 2018
  • :
  • :

బిజెపి సవాల్‌కు రావత్ సై

Harish-Rawatడెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్ బిజెపి సవాల్‌ను స్వీకరించారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో రావత్‌పై తీసిన స్టింగ్ ఆపరేషన్ వీడియో గురించి రావత్ బహిరంగంగా చర్చించాలని ప్రతిపక్ష బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ సవాల్ విసిరారు. రావత్‌కు నైతిక విలువలు ఉంటే బహిరంగ వేదికపై స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని హరీష్ రావత్ మీడియా వద్ద వెల్లడించారు. రాజకీయ సంక్షోభం సమయంలో రావత్ ఎమ్మెల్యేలకు డబ్బు ఇవ్వజూపాడని స్టింగ్ ఆపరేషన్‌లో తేలిందని బిజెపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సీడీపై ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. రావత్ ఇటీవల తన ఇంటి వద్ద జనసంవాద్ కార్యక్రమంలో భాగంగా సమావేశమైన ప్రజలతో స్టింగ్ ఆపరేషన్ వీడియోపై వివరణ ఇవ్వడం తెలిసిందే. దీని గురించి మీడియా బిజెపి నేత అజయ్‌భట్‌ను ప్రశ్నించింది. రావత్‌కు నైతిక విలువలు ఉంటే బహిరంగ వేదికపై , దాని గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు.ఈ సవాల్‌ను రావత్ స్వీకరించారు.

Comments

comments