Home జాతీయ వార్తలు లక్ష్మణ్ కు అమిత్ షా ఫోన్…

లక్ష్మణ్ కు అమిత్ షా ఫోన్…

amith-sha

న్యూఢిల్లీ: బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కు పోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో బిజెపి శ్రీకారం చుట్టిన జన చైతన్య యాత్రపై ఆయన ప్రశంసలు కురిపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, వారిలో చైతన్యం తేవాలని సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి ఫోన్ రావడంతో బిజెపి శ్రేణులు మరింత ఉత్సాహంలో యాత్రను నిర్వహించడానికి సై అంటున్నారు. మరో పక్క పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష జరపడానికి అమిత్ షా జులై 13న హైదరాబాద్ కి రానున్నారు. జులై 5 తేదీన హన్మకొండలో జరగనున్న చైతన్య యాత్రలో రామ్ మాధవ్ పాల్గొనున్నారు. 6వ తేదీన తుంగతుర్తిలో జరిగే ముగింపు సభకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరవుతున్నారని సమాచారం.