Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

నేడు అమిత్‌షా రాక

ఏడాది తర్వాత హైదరాబాద్‌కు వస్తున్న బిజెపి అధినేత 

Amith-shah

హైదరాబాద్: రాబోయే 2019 ఎన్నికల్లో బిజెపి బలోపేతానికి దిశా నిర్ధేశం చేసేందుకు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు.ఆయన రోజం తా బిజెపి రాష్ట్ర కార్యాలయంలోనే గడపనున్నారు. ఈ సందర్భం గా ఎన్నికల కమిటీలు, బూత్ కమిటీలతో వరుస భేటీలు నిర్వహిం చనున్నారు.  పాట్నా నుంచి హైదరాబాద్‌లోని బేగం పేట విమానా శ్రయానికి  ఉదయం 10ః 30 గంటలకు అమిత్‌షా ప్రత్యేక విమానంలో రానున్నారు.ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బిజెపి శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దే నిర్వహించే సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అనంతరం రాజ్‌భవన్ రోడ్ వద్ద ఉన్న హోటల్ కత్రియకు వెళ్తారు. అక్కడి నుంచి నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ అమిత్ షా వరుసగా పూర్తి కాలం విస్తారక్‌లతో సమావేశం, ఆ తర్వాత ఎన్నికల కమిటీ, రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలు, సంస్థాగత నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం తదితర అంశాలపై అమిత్‌షా ఆరా తీయనున్నట్లు తెలిసింది. ప్రధానంగా రాష్ట్రంలో బిజెపి బలంగా ఉన్న స్థానాలతో పాటు బలహీనంగా ఉన్న స్థానాలు, ఎంపి, ఎంఎల్‌ఎల స్థానాలకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక నివేదికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బిజెపి గెలిచిన స్థానాలు, బలంగా పోటీనిచ్చిన నియోజకవర్గాలు, గెలుపు ఓటములను ప్రభావితం చేసే అంశాలపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన షెడ్యూలు మొత్తం పార్టీ అంతర్గత సమావేశాలతోనే కొనసాగనుంది. అనంతరం సంపర్క్ ఫర్ సమర్ధన్‌లో భాగంగా రామోజీ ఫిలీం సిటీలో పత్రిక సంపాదకులు రామోజీరావును కలువనున్నారు.
ఏడాది తర్వాత రాక..
గత ఏడాది మేనెల లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌షా నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాష్ట్రానికి సహాయం చేస్తున్నామని చెప్పారు. దీనిపై లెక్కలతో సహా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమిత్‌షాపై విరుచుకుపడ్డారు.ఆ తరువాత నుండి త్వరలో అమిత్‌షా పర్యటన ఉంటుందని, ఆయన తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారని, త్వరలోనే అధికార పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని బిజెపి నేతలు పలుమార్లు చెబుతూ వచ్చారు. చివరకు ఏడాది తరువాత ఆయన రాక సాధ్యమైంది.

Comments

comments