Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

గుజరాత్‌లో మళ్లీ వికసించనున్న కమలం?

m,r

ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో వెల్లడి 

గుజరాత్: హోరాహోరిగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ గురువారం సాయంత్రం ముగిసింది. గుజరాత్ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు జిఎస్‌టి అమలు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే రాహుల్ గాంధీ అధ్యక్షుడైన తర్వాత జరుగున్న తొలి ఎన్నికలు కావడంతో గుజరాత్‌లో గెలిచి రాహుల్‌కు బహుమానం ఇవ్వాలని కాంగ్రెస్ తాపత్రయ పడుతోంది. గత 22 ఏళ్లుగా గుజరాత్ బిజెపి పాలనలో కొనసాగుతోంది. కాగా, మోదీ చరిష్మా, అభివృద్ధి ప్రచారస్త్రంగా పోరాడిన బిజెపి ఓటర్లను తమవైపు తిప్పుకోగలిగిందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక దశలో, గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. పోలీంగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వివిధ సంస్థలు ప్రకటించాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం భాజాపాదేనని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 18న జరగనుంది.
గుజరాత్ మొత్తం స్థానాలు-182
సిఎస్‌ఎస్-ఐబిఎస్: బిజెపి109, కాంగ్రెస్ 70, ఇతరులు 3
టైమ్స్ నౌ-విఎంఆర్: బిజెపి109, కాంగ్రెస్ 70, ఇతరులు 3
ఎబిపి-సిఎస్‌డిఎస్: బిజెపి117, కాంగ్రెస్ 64, ఇతరులు 1
రిపబ్లిక్-సి వోటర్: బిజెపి108, కాంగ్రెస్ 74, ఇతరులు 0
రిపబ్లిక్-జన్‌కీ బాత్: బిజెపి108, కాంగ్రెస్ కూటమి 74
జి న్యూస్-యాక్సిస్: బిజెపి99-113, కాంగ్రెస్ 68-82, ఇతరులు 1
న్యూస్ 18-సిఓటర్: బిజెపి108, కాంగ్రెస్ 74, ఇతరులు 0
న్యూస్ నేషన్: బిజెపి124-128, కాంగ్రెస్ 52-56, ఇతరులు 1-3
ఇండియా న్యూస్: బిజెపి110-120, కాంగ్రెస్ 65-70, ఇతరులు 0-4
సహారా సమయ్: బిజెపి110-120, కాంగ్రెస్ 65-70, ఇతరులు 0
యాక్సిస్: బిజెపి107, కాంగ్రెస్ 74, ఇతరులు 1

హిమాచల్‌ప్రదేశ్ మొత్తం స్థానాలు-68
ఇండియాటుడే: బిజెపి47-55, కాంగ్రెస్ 13-20, ఇతరులు 2
టైమ్స్ నౌ: బిజెపి51, కాంగ్రెస్ 16, ఇతరులు 1
ఎబిపి-సిఎస్‌డిఎస్: బిజెపి 32-38, కాంగ్రెస్ 16-22
విడిపిఎ: బిజెపి56, కాంగ్రెస్ 10, ఇతరులు 2
సమయ్ సిఎస్‌ఎక్స్: బిజెపి42-50, కాంగ్రెస్ 18-24, ఇతరులు 0-2
జి న్యూస్-యాక్సిస్: బిజెపి51, కాంగ్రెస్ 17, ఇతరులు 0

Comments

comments