Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రాహుల్‌గాంధీ పై బిజెపి నేత విమర్శ

Srikanth-Sharmaఢిల్లీ : ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ విమర్శల జల్లులు కురిపించారు. జెఎన్‌యు విద్యార్థి నేత అరెస్టు పై రాహుల్ స్పందించిన తీరు పై శ్రీకాంత్ శర్మ మండిపడ్డారు. రాహుల్ లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు. జెఎన్‌యూలో భారత వ్యతిరేక నినాదాలు చేసినందుకు విద్యార్థి నేత కన్నయ్యను దేశ ద్రోహం కేసులో అరెస్ట్ చేయడంతో పాటు మరో ఎనిమిది మంది విద్యార్థులను వర్సిటి బహిష్కరించిన విషయం తెలిసిందే. విద్యార్థి నేత అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ బిజెపి, ప్రధాని మోడీ, ఎబివిపిని దుయ్యబట్టారు. దేశ వ్యతిరేక చర్యలను దేశ ప్రజలు ఖండిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం రాహుల్ ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. జెఎన్‌యూలో జరిగిన దేశ వ్యతిరేక కార్యక్రమానికి మద్దతుగా ట్వీట్ చేసిన లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాషలో రాహుల్ ఆయన స్నేహితులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

 

Comments

comments