Home రాష్ట్ర వార్తలు అమిత్ షా రాకతో కమిలిన కమలం

అమిత్ షా రాకతో కమిలిన కమలం

  • రాష్ట్రంలో పదేళ్లు వెనక్కి వెళ్లిన బిజెపి
  • అబద్ధపు ప్రచారం చేసినందుకు బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి: టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో మంత్రులు హరీశ్ తదితరులు

Harish-Rao

హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం రూ.లక్ష కోట్లు ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు బిజెపి నాయకులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్రంలో బిజెపి పదేళ్లు వెనక్కు వెళ్లగా, యూపి సిఎం యోగి ఆదిత్యానాథ్ వంటి నాయకులు పర్యటిస్తే బిజెపి 50 ఏళ్లు వెనక్కు వెళుతుందన్నారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో గురువా రం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపి బాల్క సుమన్, ఎంఎల్‌సి కర్నే ప్రభాకర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంఎఎల్‌ఎ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. రూ.లక్ష కోట్లపై అధికారికంగా లెక్కలు చూపిస్తే రాజీనామా చేస్తానని సిఎం కెసిఆర్ చేసిన సవాల్‌ను స్వీకరించకుండా బిజెపి పలాయ నం చిత్తగించిందని హరీశ్‌రావు విమర్శించారు. కెసిఆర్ అడిగిన ఏ ఒక్కదా నికి బిజెపి నాయకులు సమాధానమివ్వకుండా సిఎం చెప్పినవన్నీ అక్షర సత్యాలేనని ఒప్పుకున్నారన్నారు.బిజెపి నాయకులు లక్ష కోట్ల గురించి చెప్పకుండా 90 వేల ఇండ్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బి జెపి నాయకులు అవాస్తవాలను చెప్పడం ద్వారా ప్రజల్లో అనుమానాలు కలి గించి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసే చర్యలను సహించేది లేదన్నారు. బిజెపి జాతీ య నాయకులు ఉత్తరభారతంలో మాట్లాడినట్లు ఇష్టానుసారంగా పోరుగడ్డ తెలంగాణలో మాట్లాడితే ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు. బి జెపి నాయకుల తీరుతో కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వడం కాదు రాష్ట్రమే కేం ద్రానికి నిధులిస్తున్నదని ప్రజలకు అర్థమైందన్నారు. ఏ పార్టీకైనా రాష్ట్రంలో ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని, తాను బతకాలంటే ఇంకొ కరిని చంపేయాలనే ఆలోచన మంచిది కాదన్నారు. రాష్ట్రానికి కేంద్రం విడు దల చేస్తున్న నిధులపై బిజెపి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు.
బిజెపికి నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే సిఎఎల్‌టిలో పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్లు, కంపా కింద రావాల్సిన రూ.1700 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గళమెత్తి పోరాడుతున్న తెలంగాణ న్యాయవాదుల ఆందోళనను గుర్తించి హైకోర్టును వెంటనే విభజించాలని, ఎయిమ్స్ గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన మంజూరు ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఎపిలో ఇచ్చినట్లుగానే తెలంగాణాలోనూ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఎస్‌టి, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ఉభయ సభలు చేసిన తీర్మానాన్ని 9వ షెడ్యుల్‌లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఇకనైనా బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై బట్ట కాల్చి మోకాన వేసే చర్యలు కట్టిపెట్టి తెలంగాణ అభివృ ద్థికి సహకరించాలని ఆయన కోరారు. టిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నాయ కులు చేసిన విమర్శలను హరీష్‌రావు ఖండించారు. మూడేళ్లలో జరిగిన ఏ ఉప ఎన్నికలో అయినా కాంగ్రెస్ గెలిచిందా అని ఆయన ప్రశ్నించారు. కనీసం కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించిన నారాయణఖేడ్, పాలేరు స్థానాలలో కూడా గెలవలేకపోయిందన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి ఎంఎల్‌ఎలు ఉన్న చోట కూడా అడ్రస్ లేకుండా పోయిందన్నారు.