Search
Friday 21 September 2018
  • :
  • :

లోక్‌పాల్‌పై కేంద్రం తొందర

ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్‌తో సయోధ్య? 

central

న్యూఢిల్లీ  : లోక్‌పాల్ నియామక ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏకాభిప్రాయసాధనకు కృషి చేస్తోంది. లోక్‌పాల్ ఎంపికపై సంప్రదింపులకు తమకు తగు తేదీలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను కోరింది. అవినీతి నిరోధక వ్యవస్థకు ప్రతినిధిగా నిలిచే లోక్‌పాల్ నియామకంపై జాప్యం తగదని ఇటీవలే సుప్రీంకోర్టు కేంద్రానికి చురకలు పెట్టింది. ఈ కీలక ఎంపిక ప్రక్రియ ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. దీనితో కేంద్రంలో కదలిక వచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత ఖర్గేను దీనిపై సంప్రదించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్‌పాల్ ఎంపిక వ్యవహారంపై చాలా కాలంగా కేంద్రం వివిధ స్థాయిలలో కసరత్తు నిర్వహిస్తోంది. అయితే ఇదంతా కూడా మందకొడిగానే ఉందని సుప్రీంకోర్టు మండిపడింది.

మరో వైపు లోక్‌పాల్ ఎంపిక కమిటీ భేటీలకు  ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ గైర్హాజరు అవుతోంది. మార్చి 1 తరువాత ఎప్రిల్ 10వ  తేదీలలో జరిగిన భేటీలకు ఖర్గే వెళ్లలేదు  వెళ్లలేదు. దీనితో ఎంపిక ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. తనను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారని, ప్రతిపక్ష నేతగా ఆహ్వానించలేదని, అందుకే ఈ భేటీలకు వెళ్లలేదని ఖర్గే తెలిపారు. ప్రభుత్వ వైఖరి అంతా కూడా కీలకమైన ఈ అంశంలో ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువ లేకుండా చేయడమే అని ఖర్గే నిరసన వ్యక్తం చేశారు.

రెండు సార్లు కూడా ప్రతిపక్ష నేత ప్రధాని మోడీకి ఘాటు లేఖలు సంధించారు. లోక్‌పాల్ ఎంపిక పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, దీనికి తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఖర్గే విమర్శించారు. లోక్‌పాల్‌పై మోడీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని కూడాఖర్గే నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా లోక్‌పాల్ నియామకం అసా ధ్యం అని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్క డానికి లోక్‌పాల్ ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వం కావాలనే తూట్లు పొడుస్తోందని విమర్శించారు.

Comments

comments