Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

‘ఉత్తర’ ఉత్సాహంతో గుజరాత్‌లో ముందస్తు?

  • మోడీ, షా పోస్టర్లతో ఎన్నికల కలకలం

Gujrath-Map

అహ్మదాబాద్ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఘనవిజయం నేపథ్యంలో గుజరాత్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బిజెపి ఆలోచిస్తోంది. రాజకీయవర్గాలలో ఇప్పుడు దీనిపై భారీ స్థాయిలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే గుజరా త్ బిజెపి వర్గాలు అధికారికంగా ముందస్తు ఎన్నిక ల అంశాన్ని కొట్టి పారేస్తున్నాయి. కానీ అధికార పార్టీలోని వారు, ప్రతిపక్షాల వారు కొందరు ఈ అవకాశం లేకపోలేదని చెపుతూ వస్తున్నారు. నిర్ణీత వ్యవధి ప్రకారం చూస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. ప్రధాని మోడీ స్వరా ష్ట్రం గుజరాత్‌లో ఇప్పటి మోడీ గాలి తరుణంలోనే ఎన్నికలు నిర్వహించడం ప్రయోజనకరమనే ఆలో చన బిజెపి వర్గాలలో ఉందని వెల్లడవుతోంది. జులై లో కానీ సెప్టెంబర్‌లో కానీ ముందస్తుకు పొయ్యేం దుకు వీలుందని ఊహాగానాలు వెలువడుతున్నా యి. దీనిపై ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్పంది స్తూ తమ ప్రభుత్వానికి ఐదేళ్ల ప్రజాతీర్పు ఉందని , ప్రభుత్వం పూర్తినిడివి వరకూ ఉంటుందని తెలిపా రు. ముందు అనుకున్నట్లే డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే రెండు ఘన విజయాల ప్రభావం దశలోనే ఇక్కడ కూడా ఎన్నిక లు జరిగితే సత్ఫలితాలు ఉంటాయని, మోడీ స్వస్థ లంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావడం, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీకి ప్రతిష్టాత్మకం కావడంతో వీటిలో సునాయాస విజయానికి వీలు కల్పించుకోవాలని బిజెపి వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే బిజెపి తమ ఎన్నికల నినాదం గా యుపిలో 325, గుజరాత్‌లో 150 నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలో 182 స్థా నాలు ఉన్నాయి. పలు నగరాలలో మోడీ, అమిత్ షా ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. కరపత్రాల పంపిణీ జరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరా త్‌లో బిజెపికి పలు సవాళ్లు క్లిష్టతరంగా ఉన్నాయి. పటేల్ వర్గం ఒబిసి కోటా ఉద్యమంతో మోడీ ప్రభు త్వంపై నిరసనగా ఉన్నారు. ఇక గోవధ అంశంలో దళితులపై హింసాకాండ వంటి పరిణామాలు , మోడీ జాతీయ స్థాయిలోకి వెళ్లిన తరువాత బిజెపికి ఆ స్థాయిలో తగు రీతిలో రాష్ట్రంలో నాయకత్వం వహించే వ్యక్తి లేకపోవడం, అన్నింటికీ మించి అధి కార వ్యతిరేకత వంటి అంశాలు కీలకంగా మారు తున్నాయి. ఈ దశలో ప్రతికూలత పరాకాష్టకు చేరకముందే ఇప్పటి మోడీ గాలిని అనుకూలంగా మల్చుకునేందుకు ముందస్తుకు వెళ్లితే బాగుంటుం దనే ఆలోచన బిజెపిలో బలంగా ఉందని వెల్లడ యింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ముంద స్తు ఎన్నికలు ఉంటాయనే ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా సన్నాహాలకు దిగింది. రాష్ట్రంలో పా గాకు ఆమ్ ఆద్మీపార్టీ యత్నిస్తోంది. అమిత్ షా బృందం గుజరాత్‌లో ముందస్తుకు దిగుతారని, దీని వల్ల ఆప్ చిక్కుల్లో పడుతుందని, పోటీ తగ్గు తుందని బిజెపి భావిస్తోందని ఆప్ గుజరాత్ నిర్వా హకులు, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

Comments

comments