Home జాతీయ వార్తలు నా భార్యకు ఓటేయకుంటే…

నా భార్యకు ఓటేయకుంటే…

RAJ

లక్నో : యుపిలో ఈనెల 22,26,29 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార బిజెపితో సహా అన్ని పక్షాలు పొటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ బిజెపి నేత ముస్లింలను బెదిరించాడు. తన భార్యకు ఓటేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బరబంకి స్థానం నుంచి బిజెపి నేత రాజ్‌నీత్‌కుమార్ శ్రీవాస్తవ భార్య శశి శ్రీవాస్తవ పోటీ చేస్తున్నారు. ఆమె తరపున రాజ్‌నీత్ ప్రచారం చేస్తున్నారు. బరబంకిలో జరిగిన బిజెపి ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఇది ఎస్‌పి ప్రభుత్వం కాదని, తమకు ఓటేయకుంటే ముస్లింలకు ఎవరూ సాయం చేయరని, తన భార్యకు ఓటేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని, తమకు ఓటేసి ప్రశాంతంగా ఉండాలని , లేదంటే కష్టాలు తప్పవని ఆయన ముస్లింలను హెచ్చరించారు. ఈ సభలో పాల్గొన్న ఓ మంత్రి రాజ్‌నీత్‌కుమార్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్‌నీత్‌కుమార్ బెదిరింపులపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్‌నీత్‌కుమార్ ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

BJP Leader Threaten  Muslims