Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప

                         Yaddyurappa

బెంగళూరు: మూడోసారి కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు యడ్యూరప్పచే గవర్నర్ వాజూభాయ్ రూడాభాయ్‌వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ఇవాళ కేవలం ఆయన మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. యడ్యూరప్ప కర్నాటకకు 23వ ముఖ్యమంత్రిగా కొలువుదీరారు. ప్రభుత్వ ఏర్పాటకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. బలనిరూపణకు 15 రోజులు యడ్యూరప్పకు గవర్నర్ గడువు ఇచ్చారు. అసెంబ్లీలో బలనిరూపణ తర్వాతే మంత్రివర్గ విస్తరణ జరగనుంది.

1943 ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బుకనకెరే గ్రామంలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1985లో షిమోగా జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడిగా పదోన్నతి లభించింది. 1988లో కర్నాటక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1983లో తొలిసారిగా షికారిపురా నుంచి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 1994 కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా యడ్యూరప్ప ఎదిగారు. తొలిసారి 2007 నవంబర్ 7న సిఎంగా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులకే సిఎం పీఠం నుంచి దిగిపోయారు. రెండో సారి 2008, మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి కర్నాటక సిఎంగా మూడు సంవత్సరాల 62 రోజులు పని చేశారు. 2012లో బిజెపికి ప్రాథమిక సభ్యత్వానికి, ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. కర్నాటక జనతా పక్ష పేరుతో పార్టీ స్థాపించారు. 2014లో తన పార్టీని బిజెపిలో విలీనం చేశారు. ఏడో సారి 2013లో ఎంఎల్‌ఎగా గెలిచారు. 2014లో షిమోగా నుంచి ఎంపిగా గెలిచారు.

Comments

comments