Home జాతీయ వార్తలు మోడీకి శుభాకాంక్షల వెల్లువ

మోడీకి శుభాకాంక్షల వెల్లువ

PM Narendra Modiఢిల్లీ : లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బిజెపి భారీ మెజార్టీ దిశగా దూసుకెళుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి దేశ వ్యాప్తంగా ఉన్న బిజెపి నేతలు, ఆ పార్టీ శ్రేణులతో పాటు ఎన్ డిఎ మిత్రపక్షాల నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. మోడీ నేతృత్వలో బిజెపి అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందని ఆ పార్టీ అగ్ర నేత సుష్మాస్వరాజ్ తెలిపారు. బిజెపికి అతి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టిన మోడీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. బిజెపికి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరో అగ్రనేత ఉమాభారతి కూడా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పైతం మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.  కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, జయంత్‌ సిన్హా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా తెలంగాణ సిఎం కెసిఆర్ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళుతారన్న ఆశాభావాన్ని కెసిఆర్ వ్యక్తం చేశారు.

BJP Leaders Congratulations to PM Narendra Modi