Home జిల్లాలు బిజెపి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం!

బిజెపి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం!

కలెక్టరేట్ గేట్ ఎక్కిన కార్యకర్తలు
అదుపు చేసేందుకు పోలీసుల తిప్పలు
మహిళా పోలీసులు లేక నానా తంటాలు
మహిళా నేతల అరెస్టుకు ఇబ్బందులు
15 నెలలకే మాట మార్చిన ఘనత కెసిఆర్‌దే : ఎమ్మెల్యే చింతల

5656సంగారెడ్డి: విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిం చడం లేదని ప్రశ్నిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, ముట్టడి కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. కొద్ది గంటల పాటు పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపున కలెక్టరేట్‌లో పలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నిస్తున్న కార్యకర్తలను అదుపు చేయడం, మరో వైపున నేతల్ని తరలిం చడం పోలీ స్‌లకు తలనొప్పిగా మారింది. చివరకు మహిళా నేత ఒకరు పోలీస్‌లను తప్పించుకుని కలెక్టరేట్ గేట్ దూకి లోపలికి వెళ్లారు. మహిళా నేతలను అదుపులోకి తీసుకునేందుకు చాలినంత మంది మహిళా పోలీసులు లేకపోవడం పోలీస్ అధికారులకు ఇబ్బందిగా మారింది. మగ పోలీస్‌లతో మహిళా నేతల్ని అడ్డుకోలేక నానా అవస్థలు పడ్డారు.

చాలా రోజుల తర్వాత కార్యక్రమం కావచ్చు… లేదా జగ్గారెడ్డి పా ర్టీని వీడిపోయారన్న కసితో కావచ్చు…లేకుంటే కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని అనుకున్నారో.. ఏమో..కాని ఈ ముట్టడిని బిజెపి నేతలు పకడ్బందీగా నిర్వహించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టారే ఏమో కాని..పటాన్‌చెరు, పరిసర ప్రాంత పోలీస్‌లను కూడా జిల్లా పోలీస్ అధికా రులు ఇక్కడికి పిలిపించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. సిఎం కెసిఆర్ పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారం లోకి వచ్చిన 15 నెలలలకే మాట మార్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని, సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటు బ్యాంక్ కోసం ఎంఐఎం నేతలకు భయపడి నిర్వహించడం లేదని ఆరో పించారు. 17 సెప్టెంబర్‌ను ఎందుకు నిర్వహించరో తెలపా లని డిమాండ్ చేశారు. అదే నిండు అసెంబ్లీలో హరీశ్‌రావ్ 17 సెప్టెంబర్‌ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తమని చెప్పి అప్పుడే అబద్దాలు ఆడితే ఎలా అని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులు త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోతే, కేవలం 400 మందిని మాత్రమే గుర్తించి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపు కున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు జిల్లాలో మీరిచ్చిన బంగ్లాలు, క్యాంప్ కార్యాలయాలు ఎక్కడున్నాయ్…అని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఆంధ్రా ఏజెంట్లు అంటున్నావ్…మరి ఎక్కడ నీ అభివృద్ధి అని ప్రశ్నించారు. ఓ వైపు విద్యార్థులు, వైద్యం, మరోవైపు రైతులు కరెంటు కోసం, ఎరువులు, విత్తనాలు తదితర వాటికోసం ఇబ్బందు లు పడుతుంటే ఇవేవి పట్టనట్టుగా నిర్లక్షంగా వ్యవహరి స్తున్నారని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ అధి కార ప్రతినిధి రఘునందన్‌రావ్, పటాన్‌చెరు నేత అంజి రెడ్డి, ఆదెల్లి రవీందర్ తదితరులు మాట్లాడుతూ కెసిఆర్ అధిరంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి మరిచి తన కుటుంబ అభివృద్ధినే చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క పోలీస్ శాఖ వారిని తప్ప అందరిని విస్మరించి పాలన ను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో తన పాలన వల్ల తిరుగుబాటు తప్పదని, అప్పుడు పోలీసులు రక్షణ ఉండి తమను రక్షిస్తారనే ఉద్దేశ్యంతో ఆ శాఖకు ఇన్నోవాలు, కొత్త బైకులను ఇప్పించారని విమర్శించారు.

అనంతరం కలెక్టరేట్ ముట్టడి కోసం బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అ డ్డుకున్నారు. దీంతో చాలా సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెల కొంది, పోలీసులకు బిజెపి నేతలకు తోపులాట జరిగింది. కొందరు గేటుమీదినుంచి అవతలికి దూ కడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని క్రిందికి లాగడంతో చాలా మంది నేతల బట్టలు చిరిగిపోయాయి. ఒకొక్కరిగా నేతల్ని తరలించడం పోలీస్‌లకు సవాల్‌గా మారింది. మహిళా పోలీసు లు లేక పోవడంతో మహిళా కార్యకర్తలను తరలించడానికి చాలాసేపు పోలీసులు తంటా లు పడ్డారు. జిల్లా ఇన్‌చార్జి మనోహర్‌రెడ్డి, ఎస్‌టి మోర్చా నేత అమర్‌సింగ్, జిల్లా నేతలు జగన్, విష్ణువర్ధన్‌రెడ్డి, మందుల నాగరాజు, సునీల్, మీడియా ఇన్‌చార్జి విష్ణువర్ధన్, దుర్గాప్రసాద్, విజయలక్ష్మి, ప్రభాకర్ గౌడ్, బాలేష్‌గౌడ్, నర్సింహారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నర్సారెడ్డి, విజయ్‌కుమార్, సంగమేశ్వర్, వాసు, పవన్, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డిఎస్‌పి తిరుపతన్న ఆధ్వర్యంలో సిఐలు ఆంజనేయులు, శ్యామల వెంకటేష్, పటాన్‌చెరు సిఐ లింగేశ్వర్‌రావు తదితరులు బందోబస్తు నిర్వహించారు.