Home మంచిర్యాల నల్లనేలపై కిషన్‌రెడ్డి పర్యటన

నల్లనేలపై కిషన్‌రెడ్డి పర్యటన

BJP MLA Kishan Reddy

– షరతులు లేని విఆర్‌ఎస్ అమలు చేయాలి
– కార్మిక సమస్యల అవగాహనకే మీ వద్దకు
– బిజెపి శాసన సభా పక్షనేత కిషన్‌రెడ్డి

నస్పూర్: గత మూడురోజుల నుండి సింగరేణి గని కార్మికుల ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్న బిజెపి శాసన సభా పక్షనేత కిషన్‌రెడ్డి గురువారం శ్రీరాంపూర్ డివిజ్‌లోని ఆర్కే-6 గని కార్మికులను ఉద్దేశించి మాట్లాడి, భూగర్భ గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కష్టతరమైన ప్రకృతికి విరుద్ధంగా పని చేస్తున్న స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించా రు.సింగరేణి గని కార్మికులకు ఎలాంటి నిబంధన లేని వా రసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని గని కార్మికులకు రా ష్ట్ర ప్రభుత్వం పెద ప్రజలకు అందిస్తున్నట్లుగా డబుల్ బె డ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని ,దీనికి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే వాటాను తీసుకువస్తానని పేర్కొన్నారు. గని కార్మికులకు ఇన్‌కామ్ ట్యాక్స్ రద్ధు చేయాలని, కోలిండియాలోని కార్మికులకు ఇస్తున్నట్లుగా రియంబర్స్‌మెంట్ , సింగరేణి కార్మికులకు కూడా అందించేలా ప్రయత్నం చేస్తానన్నాడు.

సింగరేణి ప్రాంతంలోవైద్యకళాశాల ఏర్పాటు చేసి, అం దులో 50శాతం రిజర్వేషన్ సింగరేణి కార్మికుల పిల్లలకు అమలు చేయాలని, అంతే కాకుండా కేంద్ర మానవ వన రుల శాఖ మంత్రితో మాట్లాడి , మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాట్కు ప్రయత్నం చేస్తానన్నాడు. సింగరేణి కార్మికుల ప్రాంత ప్రజలుఎదుర్కొంటున్న పలు సమస్యలను వచ్చిన వినతి పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ప్రయ త్నం చేస్తామన్నారు. ఈ పర్యటన రాజకీయాలకు అతీతం గా కార్మిక సమస్యల అవగాహన కోసమే పర్యటించడం జరుగుతుందన్నారు.

మందమర్రిలో…
సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికే బొగ్గు బావుల పర్యటనని బిజెపి శాసన సభా పక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణి సైరన్‌యాత్రలో భాగంగా మందమర్రి మార్కెట్ లో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల హక్కులను గత సంఘాలు హరించాయని ఆయన విమర్శించారు. సింగరేణి ఓపెన్‌కాస్టుల గనులను తగ్గించి, అండర్ గ్రౌండ్ బావులను పెంచాలని ఆయన అన్నారు. డిస్మిస్, విఆర్‌ఎస్ కార్మికుల సమస్యలను సిఎం కెసిఆర్ మరోసారి తుంగలోతొక్కారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గోనెశ్యాంసుందర్‌రావు, దీక్షితులు ,మల్లారెడ్డి, అందుగుల శ్రీనివాస్, రాంవేణు, రొడ్డ మోహన్,మేకల రమే ష్, దుర్గరాజ్,జాగేటి వెంకటయ్య, నగేష్‌తో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాండూర్‌లో…
అబ్బాపూర్ గ్రామ భూనిర్వాసితులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ శాసన సభా పక్షనేత కి షన్‌రెడి అన్నారు.బొగ్గుబావుల పర్యటనలో భాగంగా గు రువారం తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అబ్బాపూర్ సింగరేణి ముంపు గ్రా మాన్ని సందర్శించి అక్కడి గిరిజనులతో మాట్లాడారు. తమ గ్రామం సింగరేణి ముంపునకు గురవుతున్న యాజ మాన్యం మాత్రం మా డిమాండ్లను పరిష్కరించడం లేద న్నారు. తమ గ్రామానికి ఆనుకొని ఉన్న అబ్బాపూర్ ఓపెన్ కాస్టు పనులు తమకు నష్టపరిహారం చెల్లించకుండా మొ దలు పెట్టారు. బాంబు బ్లాస్టింగ్‌లతో తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బతుకుతున్నామని, ఇంటికో ఉద్యోగంతో పాటు గ్రామ సమస్యలను తీర్చలాని కిషన్‌రెడ్డికి విన్నవించారు.

అనంతరం కిషన్‌రెడ్డి గిరిజన గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఓపెన్‌కాస్టు ముంపు ప్రాంతాల సమస్యలను సిఎం కెసిఆర్ గవర్నర్ దృ ష్టికి తీసుకెల్లి మీకున్యాయం జరిగే విధంగా చూస్తానన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా నివాస్తూ ఉపాధి పొందుతున్న పోడుభూములకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకొని వాటి పక్షన పోరాడి, అహక్కులను సాధించడానికి ఈ పోరుబాట కార్యక్రమం ఏ ర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట బిజెపి నా యకులు మల్లారెడ్డి, శ్యాంసుందర్‌రావు, పుల్గం తిరుపతి, తుకారం, పాగిడి చిరంజీవి, మనోహర్, మహేందర్, కిషన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

రెస్కూ స్టేషన్‌ను సందర్శించిన కిషన్‌రెడ్డి
మంచిర్యాలఅర్బన్: కోల్‌బెల్టు సమస్యల పట్ల అవగాహన కోసం పర్యటిస్తున్న బిజెపి శాసన సభా పక్షనేత కిషన్‌రెడ్డి గురువారం మందమర్రి ఏరియాలోని రెస్కూ స్టేషన్‌ను సందర్శించారు. ఇంఛార్జీ జక్కారెడ్డి,బి జెపి పట్టణాధ్యక్షుడు కోల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్య ర్శి అందుగుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరుముల్ల పోషంలు కిషన్‌రెడ్డి సదరంగా ఆహ్వానించారు. స్టేషన్‌లో గల రెస్కూ పరికరాలను పరిశీలించి, వాటి పనితీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స భ్యులు తమ సమస్యలను పరిష్కరించే దిశగా సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరపాలని ఆయనకు వినతి ప త్రం అందించారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా ఆసు పత్రిలో ఏర్పాటు చేసిన సభకు హజరు కాకుండానే బిజెపి శాసన సభ పక్షనేత వెళ్లిపోవడంతో స్థానిక కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. కాగా కిషన్‌రెడ్డి పర్యటనలో రామకృష్ణాపూర్ పర్యటన షెడ్యుల్‌లో లేదని, సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ కా ర్యక్రమంలో బిజెపి నాయకులునరేష్, రాంకిషోర్, ఆర్నే సతీష్, తదితరలు పాల్గొన్నారు.