అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై బిజెపి నేతల వ్యాఖ్యలు కోటలు దాటుతున్నాయి. నిన్నటికి నిన్న బిజెపి మంత్రి ఉమ భారతి రామమందిరం నిర్మాణం కోసం తాను జైలుకు వెళ్లడానికైనా రెడీ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో గోషామాల్ ఎంఎల్ఎ రాజాసింగ్ చేరారు. ఆదివారం నగరంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రసంగిస్తూ రామమందిరం నిర్మాణాన్ని వ్యతిరేకించే వారి తలలు నరుకుతామన్నారు.
రామమందిరం నిర్మాణం చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్న వారి కోసం ఎదురు చూస్తున్నం. మీ తలలు నరుకుతామని ఆయన హెచ్చరించినట్లు న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ రిపోర్టులో పేర్కొంది. అంతేగాక వచ్చే ఏడాది రామనవమిలోపు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఇంతకుముందు కూడా 2015లో రాజాసింగ్ దాద్రిలో ఆవును చంపాడన్న కారణంతో అఖ్లక్ అనే వ్యక్తి హత్య విషయంలో తెలంగాణలోనూ అలా చేసిన వారికి అదే శిక్ష విధిస్తామని, ఆవులను రక్షించడానికి ప్రాణాలు తీయడానికైనా, ఇవ్వడానికైనా సిద్ధమేనని అప్పట్లో రాజాసింగ్ వ్యాఖ్యానించడం పెద్ద దుమారంగా మారింది.
ఇక వివాదాస్పద రామమందిరం-బాబ్రీ మసీదు నిర్మాణ అంశాన్ని కోర్టు బయట సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా బిజెపి నేతల వ్యాఖ్యలు ఒకింత సంచలనంగా మారుతున్నాయి.
To those who warn of dire consequences if Ram Mandir built.We were waiting for you to say this so we can behead you:Raja Singh,BJP Hyd MLA pic.twitter.com/UT6EbSXRAp
— ANI (@ANI) April 9, 2017