Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఎమ్మెల్యే కూతురిపై హత్యాయత్నం

MLA-Daughter-Attacked

పుణె : తనను ప్రేమించమంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నప్పటికీ తిరస్కరించిందనే కోపంతో ఓ యువకుడు బిజెపి ఎమ్మెల్యే కూతురిపై కత్తితో దాడి చేశాడు. ఆ యువతిని కాపాడేందుక వచ్చినవారిపై కూడా విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆ యువతి చిటికెన వేలు పూర్తిగా తెగిపోయింది.
బిజెపికి చెందిన సంజీవ్ రెడ్డి బోద్‌కుర్వార్ కూతురు అశ్విని రెడ్డి (22) పుణెలోని శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం మేనేజ్‌మెంట్ కాలేజీలో ఎంబిఎ చదువుతుంది. గత కొంత కాలంగా అశ్వినిని ప్రేమిస్తున్నానంటూ రాజేశ్ ప్రవీణ్ కుమార్ భక్షి(23) అనే యువకుడు వెంటపడుతున్నాడు. కాగా ప్రవీణ్ చేతలతో విసుగు చెందిన అశ్విని కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. తనపై ఫిర్యాదు చేసిందనే కోపంతో ప్రవీణ్ అశ్వినిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన అశ్వినిని పుణెలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు.

Comments

comments