Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

రాహుల్ డ్రగ్స్ తీసుకుంటారు: స్వామి

BJP MP Subramanian Swamy Controversial Comments on Delhi CM

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత, ఎంపి సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈ సారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై స్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ డ్రగ్స్ తీసుకుంటారని ఆయన ఆరోపించారు. పంజాబ్ లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది.  పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వోద్యోగులందరికీ డోప్ టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్పందించిన స్వామి…  పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారని, అందుకే డోప్ టెస్టులో ఆయన ఫెయిల్ కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు స్వామి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

BJP MP Subramanian Swamy says Rahul Gandhi takes cocaine and will fail dope test.

Comments

comments