Home జాతీయ వార్తలు 13న రాష్ట్రానికి అమిత్‌షా

13న రాష్ట్రానికి అమిత్‌షా

 జనచైతన్య యాత్రను మెచ్చుకున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు 

Siddaramaiah has a Countdown Begun Says Amit Shah

మన తెలంగాణ/ హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేపట్టిన జన చైతన్య యాత్రలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొననున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. జూలై 13 న అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైన నేపథ్యంలో రెండవ దశ జన చైతన్య యాత్రలో పాల్గొననున్నట్లు తెలిసింది. 8 రోజులుగా సాగుతున్న జన చైతన్య యాత్ర విశేషాలపై అమిత్ షా ఆరా తీశారు. యాత్ర సక్సెస్ కావడంతో లక్ష్మణ్ కు శనివారం అమిత్‌షా ఫోన్ చేసి అభినందించారు. యాత్రను ఇలాగే విజయవంతం చేయాలని, తాను కూడా యాత్రలో పాల్గొంటానని అమిత్‌షా సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది.

ఈ నెల 23న భువనగిరియాదాద్రి జిల్లాలో ప్రారంభమైన జన చైతన్యయాత్ర జూలై 6న తుంగతుర్తిలో ముగియనుంది. మొదటి దశ యాత్రలో పాల్గొనాలని జాతీయ నాయకులను, కేంద్ర మంత్రులను రాష్ట్ర నాయకత్వం ఇదివరకే ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత రెండవ దశ యాత్రలో అమిత్‌షాను ఆహ్వానించాలని పార్టీ వర్గాలు భావించాయి. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నారు. జూన్ 22న అమిత్‌షా హైదరాబాద్ పర్యటన ఖరారైనప్పటికీ అనివార్య కారణాలతో ఆ పర్యాటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అమిత్‌షా ఒక రోజు పర్యటనలో ప్రధానంగా పార్లమెంట్ క్లస్టర్ ఇన్‌చార్జులు, ఫుల్‌టైమర్ కార్యకర్తలు, పార్టీ ముఖ్యులతో ప్రత్యేకంగా సమా వేశం కానున్నారని, ఈ సందర్భంగా లోక్‌సభల వారిగా రూపొందించిన నివేదికను అమిత్‌షాకు అందజేస్తామని పార్టీ నేతలు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.