Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పిడిపికి బిజెపి కటీఫ్! ముఫ్తీ రాజీనామా!!

Mehbooba-Mufti-Sayeed

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పిడిపి-బిజెపి బంధం తెగిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు మంగళవారం బిజెపి ప్రకటించింది. పిడిపికి మద్దతు ఉపసంహరించుకుంది బిజెపి. సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగడం ఇక అసాధ్యమని బిజెపి పేర్కొంది. నాటకీయ పరిణామాల మధ్య హఠాత్తుగా బిజెపి నిర్ణయం తీసుకుంది. మద్దతు ఉపసంహరణ లేఖను బిజెపి గవర్నర్‌కు అందజేసింది. జమ్మూలో గవర్నర్ పాలన విధించాలని బిజెపి డిమాండ్ చేసింది. ఇక బిజెపి మద్దతు ఉపసంహరించుకోవడంతో పిడిపి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దీంతో మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఫ్తీ రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు.

ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి, జమ్ముకశ్మీర్ ఇన్‌చార్జ్ రాంమాధవ్ మీడియాతో మాట్లాడుతూ… కశ్మీర్‌లో ఉగ్రవాదం, హింస పెరిగిపోయిందని, పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిందని మండిపడ్డారు. ఇటీవల పత్రికా సంపాదకుడు షుజాత్‌ బుఖారిని హత్యయే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో అధికారాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాంమాధ‌వ్ తెలిపారు.  తాము జమ్ముకశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషి చేశామని, అభివృద్ధి కోసం ప్రయత్నం చేశామని రాంమాధవ్ అన్నారు.

Comments

comments